నిజ జీవిత కథ “సైనైడ్”

Cyanide A Movie Based On True Life Incidents To Hit The Floors Soon

కొన్ని సంవత్సరాల క్రితం సైనైడ్ మోహన్ పేరు సంచలనం సృష్టించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రక్టర్ మోహన్ 20 మంది యువతుల ధన , మాన, ప్రాణాలను హరించిన మానవ మృగం. ఇప్పుడు ఈ నిజ జీవిత కథ తో “సైనైడ్” మూవీ రూపొందనుంది. మిడ్ ఈస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై జాతీయ , అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో మలయాళ , తెలుగు , హిందీ భాషలలో “సైనైడ్” మూవీ రూపొందుతుంది.

క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీ కి ప్రదీప్ నారాయణన్ నిర్మాత. దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ .. ప్రేమ పేరు తో యువతులకు వల వేసి అత్యాచారం చేసి , ఏ మాత్రం కనికరం లేకుండా “సైనైడ్” పిల్స్ తో వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులను హతమార్చాడని , ఈ కేసులో ఈ హంతకుడికి 6 మరణ శిక్షలు , 14 జీవిత ఖైదులతో న్యాయస్థానం తీర్పునిచ్చిందని , దక్షిణాది , హిందీ భాషల నటీనటులతో తెరకెక్కించనున్నానని తెలిపారు. నిర్మాత ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ .. కరోనా పరిస్థితులు క్లియర్ అయినా తరువాత “సైనైడ్” మూవీ ని కర్ణాటక , హైదరాబాద్ ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుతామని, జార్జ్ జోసెఫ్ సంగీతం , తెలుగు డైలాగ్స్ రవి పున్నం అందిస్తున్నారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here