మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుష్క ?

Tollywood Actress Anushka Shetty Once Again Picks Up A Women Oriented Film

సక్సెస్ ఫుల్ “సూపర్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క 15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అరుంధతి , సరోజ , రుద్రమదేవి , దేవసేన, భాగమతి క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం ” విడుదలకు సిద్ధంగా ఉంది . “అరుంధతి “, “వేదం” ,”ఢమరుకం “, “రుద్రమదేవి “,” బాహుబలి 2″, “భాగమతి ” మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రముఖ బ్యానర్ పై నూతన యువ దర్శకుడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఒక మూవీ రూపొందనుందని , యువ దర్శకుడు నరేట్ చేసిన స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్టు సమాచారం. ఈ మూవీ కి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.