మొత్తానికి ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలయ్య-బోయపాటి సినిమా నుండి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి టైటిల్ నో.. ఫస్ట్ లుక్కో రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ ఏకంగా టీజర్ నే రిలీజ్ చేశారు. ఇక టీజర్ విషయానికొస్తే.. టీజర్ లో ఫైట్ ఎపిసోడ్ ను చూపించారు. పంచెకట్టుతో బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. అంతేకాదు ‘‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, శీనుగారు ‘మీ అమ్మ మొగుడు’ బాగున్నారా అనేదానికి చాలా తేడా ఉందిరా అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ సూపర్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్. మొత్తానికి బర్త్‌డేకి అభిమానులు బిగ్ ట్రీటే ఇచ్చాడు బాలయ్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనితో పాటు నాడు నందమూరి తారకరామారావు నటించిన జగదేకవీరుని కథ సినిమాలోని శివశంకరి శివానంద లహరి పాటను నందమూరి బాలకృష్ణ ఆలపించి, దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అభిమానులకు తన పుట్టినరోజు కానుకగా అందించారు. వీడియోలో తన తండ్రి ఎన్టీఆర్ పాట వస్తుండగా, బాలయ్య నేపథ్యగానం అందించారు.
కాగా ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర చేయనున్నాడు. వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం విశేషం. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: