ఈ రోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ తో పాటు పలువురు బాలకృష్ణ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు శుభాభినందనలు తెలియజేస్తూ, ట్వీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. “60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. ప్రియమైన బాలకృష్ణా… నువ్వు అరవైల్లోకి అడుగుపెట్టావు. నీ అద్భుతమైన ప్రయాణాన్ని నేను ఎంతో ప్రేమగా గుర్తుచేసుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో
ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2020
ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. “నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబాయ్… మీ 60వ పుట్టిన రోజు సందర్భంగా నా శుభాకాంక్షలు. జై బాలయ్య” అని ట్వీట్ చేశారు.
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK pic.twitter.com/C2zDH9iO44
— Jr NTR (@tarak9999) June 10, 2020
ఇక నేడు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో నిన్నటి నుండే అభిమానులకు సర్ ప్రయిజ్ లు స్టార్ట్ చేశారు. మొదట బాలకృష్ణ పాడిన పాట రిలీజ్ చేయగా.. ఆ తర్వాత బాలకృష్ణ-బోయపాటి సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా అది ఇప్పుడు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. మరి ఈ రోజు ఇంకెన్ని సర్ ప్రయిజ్ లు ఇస్తారో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: