అదృష్టానికి అంతరాయం ఏర్పడింది..!

Tollywood Actor Nandamuri Balakrishna Urges His Fans Not To Celebrate His Birthday
Tollywood Actor Nandamuri Balakrishna Urges His Fans Not To Celebrate His Birthday

కరోనా వల్ల సెలెబ్రిటీస్ తమ పుట్టినరోజు వేడుకలకు దూరంగా వుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ పుట్టినరోజు వేడుకలు దూరమయ్యారు. అంతేకాదు తమ అభిమానులకు కూడా వేడుకలు జరపొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ కూడా అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తన జన్మదిన వేడుకలను మాత్రం ఘనంగా నిర్వహించవద్దని అభిమానులకు బాలయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. స్నేహితులు, అభిమానుల మధ్యలో జన్మదిన వేడుకలు చేసుకునే అదృష్టానికి అంతరాయం ఏర్పడినందుకు బాధగా ఉందని.. కరోనా మహమ్మారి కారణంగా అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అభిమానులెవరినీ కలవడం లేదని బాలకృష్ణ తెలిపారు. ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసుకుని ఎవరూ తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ క్షేమంగా ఉండడమే తనకు దక్కే అద్భుతమైన ఆశీర్వాదమని లేఖలో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రేపు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో అభిమానులకు ఒక్కరోజు ముందే సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే బాలయ్య పాడిన పాట విడుదల చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా అప్ డేట్ కూడా ఇచ్చేసారు. మరి రేపు ఇంకెన్ని సర్ ప్రయిజ్ ఇవ్వనున్నారో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.