తమిళ్ స్టార్ హీరో శింబుపై ప్రేమ, పెళ్లి అనే ఈ రెండు టాపిక్స్ పై ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటది. గతకొద్దికాలంగా శింబు ప్రేమ జోలికి వెళ్లకుండా సైలెంట్ గానే ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా శింబు పెళ్లిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. లండన్ కు చెందిన అమ్మాయితో శింబు పెళ్లి జరగనున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. లాక్ డౌన్ అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకోనున్నారని కూడా కథనాలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వార్తలపై స్పందించిన తండ్రి శింబు తండ్రి టి.రాజేందర్ శింబు పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, అవి రూమర్లు మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు శింబు పెళ్లిపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని, శింబుకు సరిపోయే సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.జాతకాలు కలిసే అమ్మాయి దొరికితే మేమే అందరికీ తెలియజేస్తామని అప్పటివరకూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకుండా వేచి చూడాలంటూ స్పష్టత ఇచ్చారు.
కాగా తమిళ ఇండస్ట్రీలో దర్శకుడు టి రాజేందర్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శింబు. మన్మధ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక శింబు ప్రేమ వ్యవహారాల సంగతి తెలిసిందే. మొదట నయనతారతో ప్రేమ వ్యవహారం నడిపాడు. తరువాత ఇద్దరికి బ్రేక్ అప్ అయ్యింది. ఆ తరువాత శింబు కొంతకాలం హాన్సికతో కూడా ప్రేమాయణం సాగించాడు. అది కూడా కొద్దికాలమే నడిచింది. వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.
ప్రస్తుతం శింబు ‘మానాడు’ సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సురేష్ కామాక్షి నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శింబుకు జోడిగా కళ్యాణీ ప్రియదర్శన్ నటిస్తుండగా ఎస్‌ఏ చంద్రశేఖర్, భారతీరాజా, ప్రేమ్‌జీ అమరన్, కరుణాకరన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: