అది ఎన్టీఆర్ ఇష్టం..!

Its Up To Him To Choose Between Films and Politics Says Tollywood Actor Nandamuri Balakrishna
Its Up To Him To Choose Between Films and Politics Says Tollywood Actor Nandamuri Balakrishna

తన తాత పోలికలే కాదు.. ఆ వాక్చాతుర్యం.. ఆ గాంభీరత్వం అన్ని పుణికి పుచుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాల్లో ఎలాగూ స్టార్ హీరో అయ్యాడు. అయితే సినిమాలతో పాటు తమ అభిమాన హీరో రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు జూనియర్ ఎన్ టి ఆర్ అభిమానులు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కోసం 2009లో ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు తార‌క్‌. త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్టారు. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు తెరపైకి వచ్చాయి. దానికి కారణం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న బాలకృష్ణ ను ’జూనియర్ ఎన్టీఆర్‌లాంటి వ్య‌క్తులు కూడా పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి వస్తే అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్ర‌లో పార్టీకి పూర్వ వైభ‌వం వ‌స్తుంది అనే వాద‌న ఉంది’ అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘అది డేడికేష‌న్‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. అదీగాక మీరు ఫుల్ టైమ్ పొలిటిక్స్ అంటున్నారు. త‌న‌కు సినిమా యాక్ట‌ర్‌గా చాలా భవిష్య‌త్తు ఉంది. మ‌రి వాడిష్టం. ప్రొఫెష‌న్ వ‌దులుకుని ర‌మ్మ‌నముగా. ఇప్పుడు నేనున్నాను ఎం.ఎల్‌.ఎగా ఉన్నాను, సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాను. నాన్న‌గారు కూడా సీఎంగా ఉన్న‌ప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారు. కాబ‌ట్టి వారి వారి ఇష్టాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది’’ అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − three =