మంత్రి తలసానితో సినీ పెద్దలు భేటీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా తయారైంది. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట.. ఆ సంగతి నాకు తెలియదు… వార్తలు, పేపర్ల ద్వారా తెలుసుకున్నాను అని అన్నారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా… వాళ్లు అందరూ కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా శ్రీనివాస యాదవ్‌తో కూర్చుని?? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి భయపడతాం? అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చమసనీయం అయ్యాయి. ఇక నాగబాబు కూడా దీనిపై స్పందించడంతో ఈ మ్యాటర్ ఇంకా సీరియస్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వ్యవహారంపై చర్చించేందుకు ఈరోజు చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు మరోసారి సమావేశమయ్యారు. ఈ భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు, సినీ కార్మికులకు రెండో విడత సాయంపై చర్చించినట్టు తెలుస్తుంది. వాటితో పాటు బాలకృష్ణ వ్యాఖ్యలపై కూడాచర్చించినట్టు సమాచారం. ఈ భేటీకి తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, సి.కల్యాణ్, బెనర్జీ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. తొలివిడత పంపిణీపై రివ్యూ మీటింగ్ జరిగిందని అన్నారు. ఇక బాలకృష్ణ వివాదం పై ఆయన మాట్లాడుతూ.. ఎవర్నీ పిలవాల్సిన అవసరం లేదు.. పలానా వాళ్ళని పిలవాలి.. పలానా వాళ్ళని పిలవొద్దు అన్న రూల్ లేదు.. నేను కూడా వెళ్ళలేదు నన్ను కూడా పిలవలేదు.. అవసరం ఉన్నోళ్ళని పిలిచుంటారు.. .బాలకృష్ణతో అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గరకు కూడా వెళతారని చెప్పారు. దీన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్ తీసుకోవాలని ప్రభుత్వం సూచించిందనుకుంటా.. మహేశ్, వెంకటేశ్, ఇలా చాలా మందిని పిలువలేదు. ఇంట్లో పెళ్లి కాదు, బొట్టు పెట్టి పిలవడానికి. మమ్మల్ని పిలవలేదు అంటే అర్థం లేదు అని అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు స్పందన ఆయన వ్యక్తిగతమని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: