[POLL] : 17 సార్లు స్వీయ దర్శకత్వంలో నటించిన వన్ అండ్ ఓన్లీ స్టార్ ఎన్టీఆర్

the best of NTR's Directorial

ఈరోజు తేదీ మే 28..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు చలన చిత్ర రంగ చరిత్రలో ఈరోజుకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలుసు. ఎవరి అసమాన అభినయ విశ్వరూపములు చూసి తెలుగు జాతి మురిసిపోయి ఆ దివ్య మంగళ రూపాన్ని తమ హృదయాలలో ప్రతిష్టించుకుందో
ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు జన్మదినం ఈ రోజు అని ఎవరికీ గుర్తు చేయనవసరం లేదు.

1923 మే 28న జన్మించిన ఎన్టీ రామారావు 1996 జనవరి 18న పరమపదించగా వచ్చిన 97వ జయంతి ఈరోజు. తెలుగు సినీ రాజకీయ రంగాలలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అందరికీ చర్వితచర్వణమే. అయితే ప్రపంచ చలన చిత్ర చరిత్రలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నప్పటికీ అమితమైన ప్రజాదరణ పొందిన సూపర్ స్టార్స్ లో “బహుముఖ ప్రజ్ఞాశాలి”గా పేరుపొందిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్ మాత్రమే.

తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు… యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. ముఖ్యంగా అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ స్టార్ గా కొనసాగుతూ దర్శక నిర్మాతగా తనను తాను 17 సార్లు డైరెక్ట్ చేసుకోవడం ఒక రికార్డు.

( మరాఠీ దర్శక నటుడు దాదా కొండ్కే తన దర్శకత్వంలో తాను 34 చిత్రాలలో నటించిన రికార్డు ఒకటి ఉంది. అయితే అతని రికార్డును ఎన్టీఆర్ రికార్డ్స్ తో పోల్చలేము… ఎందుకంటే అది కేవలం సంఖ్యాపరమైన రికార్డు మాత్రమే తప్ప కళాత్మక, సృజనాత్మక, సాంకేతిక, నైతిక అంశాల దృష్ట్యా అతని రికార్డు ఎన్టీఆర్ ప్రతిష్టకు ఏ మాత్రం సరితూగదు. పైగా మరాఠి చిత్రాలకు బూతు హాస్యాన్ని పరిచయం చేసిన అతని రికార్డ్ గిన్నిస్ బుక్ కొలతలకు మాత్రమే పరిమితమైంది.)

స్టార్ కమ్ డైరెక్టర్ గా ప్రారంభ చిత్రం నుండి వరుసగా 7 సూపర్ డూపర్ హిట్స్ సాధించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. నిజానికి ఎన్టీఆర్ కేవలం నటనకు మాత్రమే పరిమితమై ఉంటే ఇండియన్ సినిమా ఒక మహోన్నత దర్శక నిర్మాతను మిస్ అయి ఉండేది. విశ్లేషణాత్మక, పరిశీలనాత్మక కోణంలో విశ్లేషించుకుంటే ఎన్టీరామారావు నటుడిగా ఎంత గొప్పవారో దర్శకుడిగా అంతకు పదింతల ప్రతిభా సంపన్నుడు అన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఒక అగ్రశ్రేణి స్టార్ గా వెలుగొందుతూ టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటూ time is money అన్నట్లు గంటలు నిమిషాలను కూడా కరెన్సీగా మార్చుకునే అవకాశమున్న సమయంలో తన సమయ, సహన, సమర్థ, సాహస, ప్రతిభా విశేషాలను ఫణంగా పెట్టి దర్శకత్వ బాధ్యతల సవాలును స్వాగతించారు ఎన్టీఆర్.

“సీతారామ కళ్యాణం” చిత్రంలో రాముడికి బదులుగా రావణాసురుడు పాత్ర పోషిస్తానని ఎన్టీఆర్ పట్టుబట్టడంతో ఆ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుండి కె.వి.రెడ్డి తప్పుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి can’t but పరిస్థితుల్లో దర్శకుడిగా మారిన ఎన్టీఆర్ మొదటి రెండు చిత్రాలకు దర్శకుడిగా తన పేరు కూడా వేసుకోలేదు. అలా పేరు వేసుకోకపోవడం దర్శకుల ప్రతిష్టకు భంగకరం అని కొందరు సీనియర్ దర్శకులు నచ్చజెప్పడంతో మూడవ చిత్రం శ్రీకృష్ణ పాండవీయం నుండి దర్శకుడిగా తన పేరు వేసుకున్నారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ దర్శకత్వంలో “సీతారామ కళ్యాణం ” మొదలుకొని “సామ్రాట్ అశోక్ ” వరకు మొత్తం 17 చిత్రాలు వచ్చాయి. వీటిలో 16 తెలుగు చిత్రాలు కాగా ” రాజసూయం” తమిళ చిత్రం. ఇది ఆయన దర్శకత్వంలోనే రూపొందిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి తమిళ రీమేక్. కాగా తెలుగులో ఆయన దర్శకత్వంలో వచ్చిన 16 చిత్రాల్లో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక అనే నాలుగు ప్రధాన జోనర్ చిత్రాలు ఉండగా ఆ నాలుగు జోనర్స్ లోనూ విజయాలు సాధించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ మాత్రమే.
ఇక సక్సెస్ పర్సంటేజ్ విషయానికి వస్తే తెలుగులో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 16 చిత్రాలలో 10 చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి. ఎన్టీఆర్ అసమాన అభినయ చాతుర్యానికి, అద్భుత దర్శకత్వ ప్రతిభకు 17 చిత్రాలు నిదర్శనంగా నిలిచినప్పటికీ కమర్షియల్ సక్సెస్ పరంగా చూస్తే 10 చిత్రాలు సంచలన విజయాలుగా నమోదయ్యాయి. ఈ పది చిత్రాలలో పైన చెప్పుకున్న నాలుగు జోనర్ చిత్రాలు ఉన్నాయి.

అయితే ఈ పది చిత్రాలలో మీకు నచ్చిన “చిత్రరాజం” ఏది?
ఇదే ఇవాల్టి పోల్ గేమ్…

తెలుగువారి జీవన విధానంలో అంతర్భాగంగా మమేకమై దశాబ్దాల చారిత్రాత్మక చరితార్థ ధన్యజీవిగా వెలుగొందిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు 97వ జయంతి సందర్భంగా ఆ మహామహుడి దివ్య స్మృతికి అంజలి ఘటిస్తూ “the best of NTR’s Directorial retrospective ” ఏదో మీరే నిర్ణయించండి… అంతకంటే ముందు ఆ పది చిత్రాలు ఏమిటో ఒకసారి పరిశీలనగా చూడండి.

స్వీయ దర్శకత్వంలో "ది బెస్ట్ ఆఫ్ ఎన్టీఆర్ " ఏది?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 7 =