[POLL]: బర్త్‌డే బాయ్ ‘యంగ్ టైగర్’ యన్టీఆర్‌లో మీకు నచ్చిన అంశమేది?

Which Among These Qualities of Jr NTR Do You like The Most?

మే 20.. ‘యంగ్ టైగర్’ యన్టీఆర్ పుట్టినరోజు. అభిమానులకు పండగరోజు. ప్రతీ సంవత్సరం తారక్ జన్మదినాన్ని ఒక వేడుకలా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే కరోనా ఎఫెక్ట్‌తో ‘సోష‌ల్ డిస్టెన్సింగ్’ కార‌ణంగా ఈ ఏడాది వేడుకలకు దూరంగా ఉందామని యన్టీఆర్.. అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలో.. తార‌క్ విజ్ఞప్తిని గౌర‌విస్తూ, సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు అభిమానులు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వారం, పదిరోజుల ముందుగానే సందడి షురూ చేశారు. ‘Happy Birthday NTR’ అనే హాష్ ట్యాగ్‌లతో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. య‌న్టీఆర్ పుట్టిన‌రోజుని పుర‌స్క‌రించుకుని ‘ది తెలుగు ఫిలిమ్ నగర్.కామ్’ గ‌త రెండేళ్ళుగా ఆస‌క్తిక‌ర‌మైన పోల్ గేమ్స్‌ను నిర్వ‌హిస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది సినిమాల‌పై కాకుండా కాస్త భిన్నంగా కొత్త త‌రహాలో పోల్ గేమ్‌ను నిర్వ‌హించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. స‌హజంగా.. యన్టీఆర్ అంటేనే క్వాలిటీ బ్యాంక్‌. అందుకే అనతికాలంలోనే స్టార్‌గా ఎదిగాడు. ఆ క్వాలిటీస్‌తోనే జయాపజయాలకు అతీతంగా భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. అటు పర్సనల్‌గానూ, ఇటు ప్రొఫెషనల్‌గానూ తారక్‌లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. వాటిలో ‘ఇంద్రధనస్సు’లోని ఏడు వర్ణాలలాంటి ఏడు బెస్ట్ క్వాలిటీస్‌(వ్యక్తిగతంగా, వృత్తిగ‌తంగా)ని ఎంచుకుని తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోల్ గేమ్‌ను నిర్వహిస్తున్నాం. తారక్‌లో మీకు నచ్చిన క్వాలిటీకి ఓటు వేస్తూ.. మీ ఓటు రూపంలో బర్త్‌డే విషెస్ చెప్పే అవకాశమిది. మరెందుకు ఆలస్యం.. పోల్ గేమ్‌లోకి ఎంటర్ అవుదాం.

యన్టీఆర్‌లో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 9 =