వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో కెరియర్ లో మొదటి సారి సూపర్ సక్సెస్ అందుకున్న సందీప్ కిషన్ కు ఆ తర్వాత ఆశించినంత విజయాలు దక్కలేదు అని చెప్పొచ్చు. ఇటీవలే నిను వీడని నీడను నేనే అంటూ సక్సెస్ కొట్టాడు. ఆ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించి పర్వాలేదనిపించుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సందీప్ కిషన్, నిషా అగర్వాల్ కాంబినేషన్ లో డీకే బోస్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు కాదులేండి గత ఏడేళ్ల క్రితం ఈ సినిమా తెరకెక్కింది. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్ కు నోచుకోలేదు. ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ వున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్నీక్ పీక్ వీడియో రిలీజ్ చేశారు. ఈ రోజు సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా.. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ స్నీక్ పీక్ వీడియోను రిలీజ్ చేశారు.
కాగా ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ తో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు సందీప్ కిషన్. ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: