మొత్తానికి విజయ్ ఏం చేసినా సెన్సేషనే అని మరోసారి నిరూపించాడు. సెలబ్రిటీస్ మీద తప్పుడు వార్తలు రావడం కామన్ థింగ్. ఇక వాటిని ముందు సీరియస్ తీసుకున్నా ఇప్పుడు పట్టించుకోవట్లేదు సెలబ్రిటీస్. అయితే విజయ్ మీద కూడా గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. విజయ్ కూడా వాటిని పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం తన సాయం చేసే విషయంలో.. ఛారిటీ విషయంలో తప్పుడు కథనాలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసాడు. అంతే కాదు ఒక స్పెషల్ వీడియో కూడా తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. టాలీవుడ్ మొత్తం విజయ్ కు సపోర్ట్ గా వచ్చింది. మెగా స్టార్ నుండి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా తన మద్దతును ప్రకటించింది.’మా’ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, లాక్ డౌన్ సమయంలో విజయ్ దేవరకొండ ఒక ఛారిటీని పెట్టి పేదలకు ఆసరాగా నిలిచే ప్రయత్నం చేశారని చెప్పారు. సీసీసీకి కూడా విరాళం ఇచ్చారని తెలిపారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనుకుంటున్న విజయ్ పై బురదచల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివారిని తాను నిలదీస్తున్నానని… అసలు మీరంతా ఎవరని ఆయన ప్రశ్నించారు. విజయ్ దేవరకొండకు అసోసియేషన్ మద్దతుగా ఉంటుందని చెప్పారు. ఇండస్ట్రీలో అందరూ అన్నదమ్ములమేనని అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: