‘డియర్ విజయ్’ నీ ఆవేదన అర్థమైంది..!

Mega Star Chiranjeevi Extends His Support To Vijay Deverakonda In His Combat Against Fake News
Mega Star Chiranjeevi Extends His Support To Vijay Deverakonda In His Combat Against Fake News

విజయ్ దేవరకొండ తనపై వస్తున్న తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి అందులో ‘మిడిల్ క్లాస్ ఫండ్’తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక దీనిపై విజయ్ ను విమర్శిస్తూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై విజయ్ స్పందించి…తనపై విమర్శలు చేసిన వారిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇందుకుగాను ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా విజయ్‌కు అండగా నిలిచింది. మహేష్ బాబుతో పాటు దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్‌, క్రిష్‌ లతో పాటు హీరోలు రానా, అల్లరి నరేష్‌, కార్తికేయ లాంటి వారు మద్దతు పలికారు.

తాజాగా మెగా స్టార్ చిరంజీవి కూడా దీనిపై స్పందించి విజయ్ కు మద్దతు పలికారు. ‘కిల్ ఫేక్ న్యూస్’ హ్యాష్ టాగ్ తో ఓ ట్వీట్ చేశారు. ‘డియర్ విజయ్.. మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల, మీలా నేను, నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. విజయ్ కు అండగా నిలుస్తామని. ఇలాంటి రాతల వల్ల చేసే మంచి పనులు ఆపవద్దని విజయ్ ని కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు కూడా ఓ రిక్వెస్ట్ చేశారు. వ్యక్తి గత అభిప్రాయాలను వార్తలుగా మలచొద్దని అన్నారు. మరి ఇది ఇక్కడితోనే ఆగుతుందా?లేదా? ఎంత దూరం వెళ్తుందో చూద్దాం..

 


కాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.