తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సూపర్ హిట్టయింది. ఈ ఒక్క సినిమాతో కార్తికేయ, పాయల్ రాజ్, డైరెక్టర్ అజయ్ భూపతి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ముగ్గురు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ రానున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా అజయ్ భూపతినే చెప్పాడు. ప్రస్తుతం అజయ్ భూపతి శర్వానంద్‌తో ‘మహాసముద్రం’ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. నిజానికి ఈ సినిమాను మొదట రవితేజ తో తెరెకెక్కించనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత నాగచైతన్య పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్ గా శర్వానంద్ తో చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. తర్వలో తాను ఈ హిట్ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్లు డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ ‘ఆర్ఎక్స్ 100’ సీక్వెల్ కు సంబంధించిన ఫ్లాట్ రెడీగా ఉందని అభిమానులతో తెలిపారు. ‘ఆర్.ఎక్స్ 100’ హీరో కార్తికేయకు సీక్వెల్ ప్లాట్ సూట్ అవుతుందని కూడా అజయ్ భూపతి వెల్లడించాడు. మరి ప్రస్తుతం కార్తికేయ కూడా పలు ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నాడు. హీరో కార్తికేయ అని చెప్పేసినట్టే. హీరోయిన్ ను ఎవర్ని సెలెక్ట్ చేసుకుంటాడో. ఒక రకంగా చెప్పాలంటే ‘ఆర్ఎక్స్ 100’ విజయంలో పాయల్ రాజ్ పుత్ నటన కూడా కీలక పాత్ర పోషించింది. అలాంటిది ఈ సీక్వెల్ కు కూడా తననే తీసుకుంటాడా? వేరే ఇంకెవరినైనా తీసుకుంటాడా చూడాలి..ఏం జరుగుతుంది..!
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: