వర్మ ట్వీట్ కు కేటీఆర్ ఫన్నీ పంచ్..!

KTR Gives Funny Counter To RGV Tweet
KTR Gives Funny Counter To RGV Tweet

వర్మ ట్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ట్వీట్స్ లో ఎప్పుడు ఏదో ఒక వ్యంగ్యం కనిపిస్తూనే ఉంటది. ఎప్పుడూ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం ఆయనకు అలవాటే. అయితే ఈసారి వర్మ ట్వీట్ కు పంచ్ వేశారు మంత్రి కేటీఆర్. నిన్న ట్విట్టర్ వేదికగా #AskKTR నిర్వహించారు. ఇక దీనిలో భాగంగా పలువురు నెటిజన్లు పలు డౌట్లను అడుగగా కేటీఆర్ వాళ్ళకి ఓపికగా సమాధానాలు చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో వర్మ కూడా కేటీఆర్ కు ఒక విన్నపం చేసాడు. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల అక్కడి ప్రభుత్వం మద్యాన్ని డోర్ డెలివరీ చేసేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వర్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ కోరిక కోరారు. ‘‘మీకు నాదో విన్నపం. ఎవరైతే బోర్‌గా ఫీలవుతూ జుట్టు పీక్కుంటున్నారో, చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారో, మెంటల్ ఆస్పత్రుల్లో చేరుతున్నారో, ఫ్రస్టేషన్‌తో భార్యలను కొడుతున్నారో వీరి కోసం మమతా బెనర్జీ లాంటి పెద్ద మనస్సు ఉండాలి. అలాంటి పద్ధతినే ఇక్కడ కూడా ప్రవేశపెట్టండి’’ అని వర్మ ట్వీట్ చేశారు.


ఇక వర్మ ట్వీట్ కు కేటీఆర్ కూడా స్పందించి వర్మకు చిన్న కౌంటర్ ఇచ్చారు. ‘రామూ గారూ.. హెయిర్‌ కట్‌ గురించే అడుగుతున్నారు కదా’ అంటూ చమత్కరించారు.

 


మొత్తానికి వర్మకు లాక్ డౌన్ వల్ల పెద్ద సమస్యనే వచ్చి పడింది. ఎక్కడికి వెళ్ళడానికి లేదు… ఇంటర్వ్యూలు ఇచ్చేది లేదు… కాంట్రవర్సీలు లేవు … ఎలా టైం స్పెండ్ చేస్తున్నాడో ఏమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.