బ్లాక్ బస్టర్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న “మహాసముద్రం ” మూవీ కి హీరో శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “మహాసముద్రం ” మూవీ నుండి సమంత వైదొలగిన తరువాత సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేయాలని దర్శకుడు ప్లాన్ చేశారు. ఈ మూవీ లో నటించేందుకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో శర్వానంద్ ప్రస్తుతం “శ్రీకారం ” మూవీ లో నటిస్తున్నారు. తరువాత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందే మూవీ లో నటించనున్నారు. ఈ మూవీ లో సాయి పల్లవి కథానాయిక. ఈ మూవీ ని, “మహా సముద్రం” మూవీ ని ఏక కాలం లో రూపొందేలా శర్వానంద్ ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్ తో సాయి పల్లవి కంటిన్యూ గా రెండు సినిమాలలో నటిస్తారా, లేదా అన్న విషయం తెలియాల్సిఉంది. “మహా సముద్రం” మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం “విరాటపర్వం” మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: