కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక డాక్టర్స్, పోలీసులు అయితే తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంకోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పని చేస్తోన్న వైద్యులు, పోలీసులపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్, చిరు పోలీసులను ప్రశంసించగా…వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఆసుపత్రుల్లో బాధితుల ప్రాణాలు కాపాడుతున్న సూపర్ హీరోలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే, కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు కాపాడుతున్నందుకు థ్యాంక్స్’ అని ట్వీట్ చేశారు. ‘మీరు నిజమైన హీరోలు సెల్యూట్’ అని వెంకటేశ్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, పోలీసులను ట్యాగ్ చేశారు. ‘మీరు నిజమైన హీరోలు సెల్యూట్’ అని వెంకటేశ్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ, పోలీసులను ట్యాగ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో ‘అసురన్’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Let’s take a moment to wholeheartedly thank all the superheroes saving lives in hospitals, the police force for fighting a bigger battle against COVID-19. Thank you for safeguarding our lives and our families during these tough times!!
— Venkatesh Daggubati (@VenkyMama) April 11, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: