యువ కథానాయకుడు నాగచైతన్య కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `మనం` ఒకటి. తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుతోనూ, తండ్రి అక్కినేని నాగార్జునతోనూ కలసి నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్… హార్థికంగానూ, ఆర్థికంగానూ మంచి ఫలితాన్ని ఇచ్చింది. అలాంటి… `మనం`ని రూపొందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చైతూ. అంతేకాదు.. తన తొలి చిత్ర నిర్మాత `దిల్` రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తాడని వినిపిస్తోంది. త్వరలోనే చైతూ, విక్రమ్, `దిల్` రాజు కాంబినేషన్ మూవీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కాగా, చైతూ ప్రస్తుతం `లవ్ స్టోరీ`తో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా వేసవిలో సందడి చేయనుంది. అలాగే పరశురామ్ డైరెక్టోరియల్ తో పాటు `బంగార్రాజు`లోనూ నటించబోతున్నాడు ఈ అక్కినేని హ్యాండ్సమ్ హీరో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: