`క్రిష్` సిరీస్… దేశవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని విశేషంగా అలరించిన సూపర్ హీరో ప్రాంఛైజీ ఇది. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ తో అతని తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్ రూపొందించిన ఈ సిరీస్ లో ఇప్పటివరకు మూడు చిత్రాలు వచ్చాయి. వీటిలో చివరి రెండు సినిమాలైన `క్రిష్`, `క్రిష్ 3`… తెలుగులోనూ ఆదరణ పొందాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కట్ చేస్తే.. ఏడేళ్ళ విరామం తరువాత ఈ సిరీస్ లో నాలుగో చిత్రం తెరకెక్కనుంది. `క్రిష్ 4` పేరుతో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హృతిక్ రోషన్ కి జోడీగా అందాల తార దీపికా పదుకొణే ఎంపికైందని సమాచారం. `క్రిష్` సిరీస్ లో తొలి చిత్రమైన `కోయి మిల్ గయా`లో ప్రీతి జింతా నాయికగా నటిస్తే… రెండు, మూడు చిత్రాలైన `క్రిష్`, `క్రిష్ 3`లో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటించింది. కాగా, ఇప్పుడు ఈ సిరీస్ లోని నాలుగో చిత్రంలో దీపిక నాయికగా నటించనుండడం వార్తల్లో నిలుస్తోంది. ఇదివరకు ఈ పాత్ర కోసం కత్రినా కైఫ్ తో సహా పలువురు ప్రముఖ కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే, ఆ అవకాశం దీపికకి దక్కిందన్నది బీటౌన్ టాక్. త్వరలోనే `క్రిష్ 4`లో దీపిక ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. రాకేష్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబందించి మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: