మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి `క్రాక్` కాగా.. మరొకటి `రాక్షసుడు` ఫేమ్ రమేష్ వర్మ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్. గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న `క్రాక్` ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. మే 8న జనం ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రమేష్ వర్మ డైరెక్టోరియల్ విషయానికి వస్తే… ఓ తమిళ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. కాగా… ఇందులో రవితేజకి జోడీగా `నేల టిక్కెట్టు` ఫేమ్ మాళవికా శర్మ నటిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. `నేల టిక్కెట్టు` ఆశించిన విజయం సాధించకపోయినా… అందులో రవితేజ, మాళవిక జంటకి మంచి మార్కులే పడ్డాయి. త్వరలోనే మాళవిక ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం మాళవికా శర్మ… రామ్ హీరోగా నటిస్తున్న `రెడ్`లో నాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: