రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఇప్పటికే పలు రీమేక్స్ లో నటించడమే కాకుండా వాటిలో సింహభాగం చిత్రాలతో ఘనవిజయాలను కూడా అందుకున్నారాయన. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `నారప్ప` కూడా తమిళ చిత్రం `అసురన్` ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. `నారప్ప` నిర్మాణంలో ఉండగానే మరో రీమేక్ కి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఘనవిజయం సాధించిన `డ్రైవింగ్ లైసెన్స్`(2019)ని తెలుగులో రీమేక్ చేసేందుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ఇందులోనే వెంకీ ప్రధాన పాత్రలో నటించబోతున్నారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ రీమేక్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: