‘ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (సాయి తేజ్), ‘దువ్వాడ జగన్నాథమ్’ (అల్లు అర్జున్), ‘గద్దల కొండ గణేష్’ (వరుణ్ తేజ్)… ఇలా వరుసగా మెగా కాంపౌండ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్… తన నెక్ట్స్ ప్రాజెక్టు ను కూడా అదే ఫ్యామిలీ హీరోతో చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… హరీష్ శంకర్ ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని సంప్రదించి ఓ ఆసక్తికరమైన స్టోరీ లైన్ ని వినిపించాడట. అది నచ్చడంతో… వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చరణ్. ఈ నేపథ్యంలో… ప్రస్తుతం హరీష్ ఫుల్ స్క్రిప్టుని రెడీ చేసే పనిలో ఉన్నాడని టాక్. కాగా ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సమాచారం. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత చరణ్ నుంచి వచ్చే సినిమా ఇదే కావచ్చు. త్వరలోనే చరణ్, హరీష్ కాంబినేషన్ మూవీ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: