బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్ లో ప్రత్యేకం గా నిలిచిన చిత్రం ‘మైనే ప్యార్ కియా’. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ కథానాయకిగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరైన ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సూరజ్ ఆర్ బర్జత్య దర్శకుడిగా తొలి అడుగు వేశాడు. రామ్ లక్ష్మణ్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో విశేష ఆదరణ పొందాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో సల్మాన్ ఖాన్ పై చిత్రీకరించిన అన్ని పాటలను గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించడం విశేషం. ‘దిల్ దీవానా’, ‘కబూతర్ జా జా జా’… ఇలా ప్రతీ పాట ఒక ఆణిముత్యంలా నిలిచింది. 1989 లో విడుదలయిన భారతీయ చిత్రాల్లో ‘మైనే ప్యార్ కియా’నే హైయస్ట్ గ్రాసర్ కావడం విశేషం. తెలుగులోనూ ‘ప్రేమపావురాలు’ పేరుతో అనువాదమైన ఈ మ్యూజికల్ సెన్సేషన్… ఇక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. 1989 డిసెంబర్ 29న విడుదలైన ‘మైనే ప్యార్ కియా’… నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: