టాలీవుడ్ లో హీరో , దర్శకుల వారసులు హీరోలుగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిర్మాతల వారసులు హీరోలుగా టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరో గా మారిన విషయం తెలిసిందే. నిర్మాత రామానాయుడు తనయుడు వెంకటేష్, బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్
సక్సెస్ ఫుల్ హీరోలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, లగడపాటి వారసులు టాలీవుడ్ కు హీరోలుగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీ “హుషారు “దర్శకుడు శ్రీ హర్ష దర్శకత్వంలో దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ రెడ్డి, లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహదేవ్ హీరోలుగా “రౌడీ బాయ్స్ ” మూవీ రూపొందనుంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో కూడిన ఎమోషనల్ డ్రామా గా రూపొందనున్న “రౌడీ బాయ్స్ ” ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వ ర్క్ జరుపుకొంటుంది. జనవరి లో సెట్స్ పైకి వెళ్ళనుంది. కొత్త జనరేషన్ హీరోలతో టాలీవుడ్ సందడి గా మారనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: