‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే…మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్ననే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సింగిల్స్ ఆంథమ్ ఈ పాటను రిలీజ్ చేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రస్తుతం పాటల చిత్రీకరణలో టీమ్ రోమ్ లో వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నితిన్, రష్మిక `వార్` సినిమాలోని గుంగ్రూ పాటకు చేసిన ఓ డ్యాన్స్ చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హృతిక్ పై ప్రేమతో ఈ పాట చేసినట్టు తెలిపారు. ఇక ఈ వీడియో నెట్టింట్లో హల్ చేస్తుంది. ఇక ఈ వీడియో పై హృతిక్ స్పందించి థ్యాంక్స్ నితిన్, రష్మిక చెపుతూ.. టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
Sweet. Thank you so much Rashmika & Nithiin. Best wishes for #Bheeshma! Love you guys 🙂 https://t.co/twzubWSuWQ
— Hrithik Roshan (@iHrithik) December 28, 2019
కాగా రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మహతి సాగర్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)