మొత్తానికి రామ్ గోపాల్ వర్మ ఒక పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరీస్ లు అంటూ ఒకదాని తర్వాత ఒకటి చేసినా చేయకపోయినా అప్ డేట్స్ మాత్రం ఇస్తున్నాడు. ఒక సినిమా పేరు ప్రకటించేలోపే మరో సినిమాను విడుదల చేస్తుంటాడు. ఇప్పటికే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ లు సినిమాతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు… రాజకీయ నాయకులపై పొలిటికల్ పంచ్ గా ఈ సినిమాను తీసి రిలీజ్ చేశాడు. ఇంకా ‘బ్యూటిఫుల్’, ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే సినిమాలు లైన్ లో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు రెండూ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా మరో ప్రకటన ఇచ్చాడు. ముంబై అండర్‌వరల్డ్ మాఫియా నేపథ్యంలో ఓ వెబ్‌సిరీస్ తీస్తానని చెప్పుకొచ్చాడు వర్మ. గత రెండు దశాబ్దాల నుంచి నెలకొన్న పరిస్థితులపై చాలా పరిశోధించి కీలక విషయాలు సేకరించాను. నేను సిద్దం చేసిన కథను చూపించాలంటే కేవలం వెబ్‌సిరీస్ అయితేనే సంపూర్ణ న్యాయం జరుగుతుంది. ఇటీవలే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన మిగిలిన విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పాడు వర్మ. చూద్దాం మరి ఈ వెబ్ సిరీస్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























