అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ప్రతిరోజూ పండగే ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఒక నూతన కాన్సెప్ట్ తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన “ప్రతి రోజూ పండగే ” మూవీ లో సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ప్రతి రోజూ పండగే ” మూవీ పై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా మూవీ పై తన స్పందన తెలియజేశారు. మానవ సంబంధాలు, వారి ఎమోషన్స్ కామెడీ తో కలిపి ఎంటర్ టైనర్ గా రూపొందిన ” ప్రతి రోజూ పండగే ” మూవీ తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమని, తేజ్, మారుతి , మూవీ మొత్తం టీమ్ కు అభినందనలు అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: