యూత్ ఫుల్ చిత్ర దర్శకుడు మారుతి దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన “ప్రతి రోజూ పండగే ” మూవీ ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళతో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. కామెడీ ఆసరాగా ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానం గా సాగిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ప్రతి రోజూ పండగే ” మూవీ ఘనవిజయం పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన స్పందన తెలియజేశారు. సుకుమార్ మాట్లాడుతూ .. ఈ మూవీ నిజంగానే థియేటర్ లలో పండగ చేస్తుందని, మూవీ కంటెంట్ నచ్చిందని, నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు మారుతి తనకు మంచి మిత్రులని, ఇద్దరూ కలసి విజయం సాధించడం తనకు ఆనందం కలిగించే విషయమని, “ప్రతి రోజూ పండగే ” మూవీ విజయంలో టీమ్ పాత్ర ఎంతో ఉందని, టీమ్ కు అభినందనలు అన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: