వరుస అప్ డేట్స్ తో అభిమానులకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం. ఇక ప్రతి సోమవారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’ టీం సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇప్పటికే మూడు పాటలను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేసింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ ఫుల్ వెర్షన్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్.
కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























