బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా ‘వెంకీమామ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. క్రిస్మన్ అన్నారు… జనవరి సంక్రాంతి అన్నారు.. ఇప్పుడు అవేమి కాకుండా.. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అంటే డిసెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు… ఒకట్రెండు రోజుల్లో `వెంకీమామ` విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇవన్నీ ఏమో కానీ వెంకీమామ సినిమా విషయంలో చైతు మాత్రం ఫుల్ హ్యాపీలో వున్నాడట. ఈ సినిమా ఫైనల్ కాపీని చైతు చుసాడంట. సినిమా బాగా రావడంతో హ్యాపీగా వున్నాడట. ఫస్ట్ హాఫ్ వినోదాత్మకంగా.. సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్ తో బాబీ బాగా తీసాడట. మరి చైతు అయితే హ్యాపీ.. అసలు రిజల్ట్ ఏంటో తెలియాలంటే సినిమా వచ్చినంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మరి మామఅల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. అభిమానులు కూడా వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ అంచనాలను వెంకీమామ రీచ్ అవుతుందో?లేదో? చూద్దాం…
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: