‘దర్బార్’ డబ్బింగ్ పూర్తి చేసిన తలైవా

Rajinikanth Wraps Up Dubbing For Darbar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Darbar Movie Updates,Darbar Telugu Movie Latest News,Darbar Movie Shooting Updates,Darbar Telugu Movie Shooting Latest News

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన తన పోర్షన్ ను రజనీ పూర్తి చేశారు. ఆ తరువాత హిమాలయాలకు వెళ్లి వచ్చిన ఆయన, ఇటీవలే డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు. ఇక తాజాగా రజనీ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోవడం పూర్తయిందని, తాజాగా తన ట్విట్టర్ ద్వారా మురుగదాస్ తెలియజేశాడు. రజనీతో కబుర్లు చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను దిల్ రాజు, NV ప్రసాద్, UV వంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.