మళ్ళీ ఆ హీరోతోనే సాహో డైరెక్టర్ సినిమా..?

Sujeeth To Work With Sharwanand Again?

తన మొదటి సినిమా ‘రన్ రాజా రన్’ తోనే మంచి హిట్ కొట్టాడు సుజీత్. ఆ హిట్ తో ఏకంగా ప్రభాస్ తోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రభాస్ బాహుబలి సినిమా అయిపోయేంతవరకూ వెయిట్ చేసి మరీ ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా సాహో సినిమాను తెరకెక్కించాడు. ఇంత చిన్న వయసులోనే ఈ రేంజ్ లో సినిమా తీసిన సుజీత్ పై అందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సాహో సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సుజీత్ ఇప్పుడు మరో కథతో రెడీ అయినట్టు తెలుస్తుంది. అయితే మళ్ళీ తను తన పాత హీరోతోనే సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదో..తనకు హిట్ ఇచ్చిన శర్వానంద్ తో. శర్వానంద్ కోసం ఓ కథను సిద్ధం చేశాడట సుజీత్. త్వరలోనే ఆయన ఆ కథను శర్వానంద్ కి వినిపించనున్నాడని అంటున్నారు. శర్వానంద్ కు కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సుజీత్ నెక్ట్స్ సినిమా ఆయనతోనే ఉంటుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.