హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు లో నిశ్శబ్ధం టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అంజలి ఏ పాత్ర పోషిస్తుందో తెలిసిపోయింది. ఈ సినిమా షూటింగు చాలావరకూ అమెరికాలో జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి పోలీస్ ఆఫీసర్ గా అంజలి కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ పాత్ర కోసం అంజలి బాగానే కష్టపడిందట. ఈ తరహా పాత్రలో అంజలి కనిపించనుండటం ఇదే మొదటిసారి. ఆమె పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. మరి చూద్దాం అంజలి ఎలా నటించిందో.
ఇక ఈ సినిమాలో ఇంకా మాధవన్, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: