ఇస్మార్ట్ శంకర్ మూవీ ఘనవిజయం సాధించడంతో విజయో త్సాహం తో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఈ మూవీ రూపొందనుంది. కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్ లో రూపొందిన నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ మూవీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరి
కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ తడం కు తెలుగు రీమేక్ వెర్షన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రామ్ ఈ మూవీ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. నివేత పేతురాజ్, మాళవిక శర్మ కథానాయికలు. సూపర్ హిట్ మూవీ రీమేక్, హిట్ కాంబినేషన్, రామ్ ద్విపాత్రాభినయం ఈ మూవీ కి ప్రత్యేక ఆకర్షణలు. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ రెండవ వారం లో ప్రారంభం కానుందని సమాచారం. తమ అభిమాన హీరో రామ్ డ్యూయల్ రోల్ నటించనున్న ఈ మూవీ కై అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. డిఫరెంట్ స్క్రిప్ట్స్ ను ఎంపిక చేసుకొంటున్న హీరో రామ్ కు అభినందనలు తెలుపుదాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: