మ్యూజిక‌ల్ హిట్‌ ‘రావోయి చందమామ’కి 20 ఏళ్ళు

20 Years For Musical Hit Raavoyi Chandamama,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Raavoyi Chandamama Telugu Movie,Raavoyi Chandamama Movie Completes 20 Years,Musical Hit Raavoyi Chandamama

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘రావోయి చందమామ’ ఒకటి. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌ను… వైజయంతి మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించారు. నాగ్‌కి జోడిగా అంజలా ఝవేరి, కీర్తి రెడ్డి నటించగా… జగపతిబాబు, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, అలీ, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, రంగనాథ్, సుధ, ‘షావుకారు’ జానకి, ఝాన్సీ, బేబీ నిహారిక ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మాజీ ప్ర‌పంచసుంద‌రి ఐశ్వర్యారాయ్ ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మెలోడీ బ్రహ్మ” మణిశర్మ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. “స్వప్న వేణువేదో”, “నందనందనా”, “ఝుమ్మని ఝుమ్మని”, “లేత లేత”, “మల్లె పూవా”, “నా కోసమే”, “జగడం జవాని”, “లవ్ టు లివ్”, “గుడు గుడు గుంజం”… ఇలా ఈ సినిమాలోని 9 పాట‌లు సంగీత ప్రియులను రంజింపచేశాయి. 1999 అక్టోబర్ 15న విడుదలైన ‘రావోయి చందమామ’… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =