హీరో రజనీకాంత్ , దర్శకుడు శివ కాంబినేషన్ మూవీ

Rajinikanth New Movie with Tamil Mass Director Siva,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rajinikanth New Movie with Director Siva,Tamil Mass Director Siva Next Movie with Rajinikanth,Rajinikanth New Movie Details

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ రిలీజయినా, కొత్త మూవీ అనౌన్స్ అయినా అభిమానులకు పండగే. రజినీకాంత్ 168వ మూవీ ప్రకటన ఈ రోజు జరిగింది. రజనీకాంత్ హీరో గా ఏందిరన్ , పెట్ట వంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ మూవీ ని నిర్మించనుంది. తమ బ్యానర్ లో రజనీకాంత్ కాంబినేషన్ లో మూడవ మూవీ అని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. దర్బార్ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన రజనీకాంత్ తన కొత్త మూవీ కి సిద్ధం అయ్యారు. దర్బార్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.

మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ హీరో గా సన్ పిక్చర్స్ బ్యానర్ పై మాస్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. హీరో రజనీకాంత్, దర్శకుడు శివ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ మూవీ ఈ సంవత్సరం ఆఖరుకు సెట్స్ పైకి వెళ్ళనుంది. రజినీకాంత్ 168వ మూవీ ప్రకటన వెలువడగానే ప్రేక్షకులు, అభిమానులలో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2020 వేసవికి రిలీజ్ కానుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here