యన్టీఆర్ ‘నర్తనశాల’కు 56 ఏళ్ళు

NTR Classic Film Narthanasala Completes 56 Years,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Narthanasala Completes 56 Years,NTR Narthanasala Completes 56 Years,56 Years of Narthanasala Movie

మహానటుడు యన్.టి.రామారావు, `పౌరాణిక బ్రహ్మ` కమలాకర కామేశ్వరరావుది విజయవంతమైన జోడి. ‘చంద్రహారం’(1954)తో మొదలైన వీరి ప్రయాణం… ‘శ్రీకృష్ణ విజయం’(1971) వరకు సాగింది. అలా.. వీరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘నర్తనశాల’ ఒకటి. 12 ఏళ్ళ వనవాసానంతరం పాండవులు… విరాటరాజ కొలువులో ఏడాది పాటు చేసిన అజ్ఞాతవాస వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్ర‌మిది. యన్.టి.రామారావు, సావిత్రి, ఎస్‌. వి. రంగారావు, మిక్కిలినేని రాధాకృష్ణ, దండమూడి రాజగోపాల్, రేలంగి, ముక్కామల, కైకాల సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, శోభన్‌బాబు, ధూళిపాళ‌, ఎల్.విజయలక్ష్మి తదితరులు ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రంలో కాంతారావు, కాంచనమాల, సూర్యకాంతం, నెల్లూరు కాంతారావు, లక్ష్మీరాజ్యం అతిథి పాత్రల్లో దర్శనమిచ్చారు.

సముద్రాల రాఘ‌వాచార్య‌, శ్రీశ్రీ రచించిన గీతాలకు… సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పన చేసారు. వాటిలో “జనని శివకామిని”, “నరవరా ఓ కురువరా”, “ఎవ్వ‌రికోసం ఈ మందహాసం”, “దరికి రాబోకు”, “సఖియా వివరించవే”, “స‌ల‌లిత రాగ‌” వంటి పాటలు ప్రాచుర్యం పొందాయి. రాజ్యం పిక్చర్స్ పతాకంపై సి.లక్ష్మీరాజ్యం, సి.శ్రీధర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1963 అక్టోబర్ 11న విడుదలై సంచ‌ల‌న‌ విజయం సాధించడమే కాకుండా… `ఉత్తమ ద్వితీయ చిత్రం`గా జాతీయ స్థాయి పురస్కారాన్ని కూడా అందుకున్న ‘నర్తనశాల’… నేటితో 56 వసంతాలను పూర్తి చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here