`నేనే రాజు నేనే మంత్రి`లో జోగేంద్ర, రాధగా అలరించిన రానా, కాజల్ అగర్వాల్… మరోసారి కలసి నటించేందుకు సిద్ధమవుతున్నారా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… కొరియన్ ఫిల్మ్ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా రూపొందిన `ఓ బేబీ`తో మెమరబుల్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి… మరో కొరియన్ ఫిల్మ్ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో రానా కథానాయకుడిగా నటించడమే కాకుండా తనే స్వయంగా నిర్మిస్తాడట. కాగా… డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కాజల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుందట. ఇదివరకు తమిళ చిత్రం `జిల్లా`(2014)లో కూడా కాజల్ కాప్‌గా నటించి మెప్పించింది. మరి… కలిసొచ్చిన కథానాయకుడు, పాత్రతో మరోసారి సందడి చేయనున్న కాజల్‌కి ఈ కొరియన్ రీమేక్ ఫిల్మ్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
త్వరలోనే కాజల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: