మలయాళం సినిమా అంగమలై డైరీస్ ను తెలుగులో ‘ఫలక్ నుమా దాస్’ గా రీమేక్ చేసి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఇక ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విశ్వక్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్’ అనే కొత్త సినిమాతో రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పరిచయం అవుతున్న లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ సినిమా ను బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్నారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నాని తన స్వంత బ్యానర్ వాల్ పేపర్ లో కూడా విశ్వక్ తో సినిమా చేస్తున్నట్టు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటదికదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆక్టోబర్ లో ప్రారంభించనున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది .
వీటితో పాటు మరో బాలీవుడ్ రీమేక్ లో కూడా విశ్వక్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవలే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ కామెడీ ‘సోను కి టిటు కి స్వీటీ’ సినిమా హక్కులను సొంతం చేసుకోగా… ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం విశ్వక్ సేన్ ను సంప్రదించినట్టు తెలుస్తుంది. విశ్వక్ సేన్ కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: