ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో విజయ్ సింగరేణి ఉద్యోగిగా కనిపించనున్నాడని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా హీరో అనే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. దానితోపాటు పూరితో కూడా సినిమా చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించాడు. ఇక తాజా సమాచారం ప్రకారం జనవరిలో ఈ సినిమా షూటింగ్ ను మొదలపెట్టనున్నట్టు తెలుస్తుంది. క్రాంతి మాధవ్ సినిమా అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నాడట విజయ్.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో విజయ్ ఒక డాన్ కొడుకని ఈ సినిమా కథ డాన్ కి .. అతని కొడుక్కి మధ్య నడుస్తుందనీ, డాన్ గా ఒక సీనియర్ హీరో నటిస్తాడనే ప్రచారం రెండు మూడు రోజులుగా జరుగుతోంది. అయితే ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ప్రేమకథా నేపథ్యంలోనే ఈ సినిమా వుంటుందట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: