భాగీ, భాగీ 2 సిరీస్ తో మంచి హిట్స్ కొట్టాడు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్. యాక్షన్ సన్నివేశాలే ‘భాగీ’ సిరీస్‌ను బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలుపుతున్నాయి అనొచ్చు. టైగర్ ష్రాఫ్, దిశాపటానీ జంటగా తెరకెక్కిన భాగీ 2ను ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. 2016లో తెలుగు సినిమా క్షణం రీమేక్‌గా బాలీవుడ్లో భాగీ తెరకెక్కించి ఘనవిజయం దక్కించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సిరీస్‌లో మూడో పార్ట్ ‘భాగీ 3’తో సిద్ధమయ్యారు టైగర్. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డైనమైట్ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో భాగీ సినిమా రాగా ఇప్పుడు 3వ సిరీస్ లో కూడా శ్రద్దానే తీసుకున్నాడు. ఇంకా ఈ సినిమాలో రితేష్ దేశముఖ్, రోనీ రాయ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండగా.. టోనీ కక్కర్ తనిష్క్ బాఘ్చి సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు 2020 మార్చి 6న ‘భాగీ 3’ న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసార.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో స్టంట్స్‌ను సొంతంగా కంపోజ్ చేసుకుంటున్నారట టైగర్. మార్షల్ ఆర్ట్స్‌లో టైగర్ ష్రాఫ్‌కు మంచి అనుభవం ఉంది. కానీ ‘భాగీ 3’ యాక్షన్ మరింత కొత్తగా ఉండటం కోసం కుంగ్ ఫూ, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నారట. మరి చూద్దాం ఈ సినిమాతో మరో యాక్షన్ హిట్ కొడతాడేమో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























