యువ కథానాయకుడు నితిన్, ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘భీష్మ’. సింగల్ ఫరెవర్ అన్నది ఉప శీర్షిక. నితిన్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో… నితిన్, ‘వెన్నెల’ కిషోర్ మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ను… సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని… సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
కాగా… ఇప్పటికే చిత్ర యూనిట్ క్రిస్మస్ కి తమ సినిమా రాబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విడుదల తేదీగా డిసెంబర్ 27 వినిపిస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏదేమైనా, విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: