పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘గుడుంబా శంకర్’ ఒకటి. వీరశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను… అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పవన్ సోదరుడు కె.నాగబాబు నిర్మించారు. పవన్‌కి జోడిగా మీరా జాస్మిన్ నటించగా… ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, అలీ, సునీల్, వేణుమాధవ్, షాయాజీ షిండే, కోట శ్రీనివాసరావు, భువనేశ్వరి, కవిత, జ్యోతి, రాజన్ పి.దేవ్, నతన్యా సింగ్ (ప్రత్యేక గీతం) తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మెలోడీ బ్రహ్మ” మణిశర్మ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. “చిగురాకు చాటు చిలకా”, “చిట్టి నడుమునే”, “ఏమంటారో”, “చిలకమ్మ”, “లే లే లేలే”, “కిళ్ళి కిళ్ళి”… ఇలా అన్ని పాటలు శ్రోతలను అలరించాయి. 2004 సెప్టెంబర్ 10న విడుదలైన `గుడుంబా శంకర్’… నేటితో 15 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: