ఈగిల్స్ ఐ బ్యానర్ పై రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న కామెడీ హారర్ పెట్రో మాక్స్ తమిళ మూవీసెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. యోగి బాబు, కాళి వెంకట్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహి V రాఘవ్ దర్శకత్వంలో తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ మూవీ విజయం సాధించింది. ఆనందో బ్రహ్మ మూవీతమిళ రీమేక్ పెట్రో మాక్స్ మూవీ. గిబ్రాన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెట్రో మాక్స్ మూవీ లో తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తమన్నా సెకండ్ లుక్ ను బిజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ రిలీజ్ చేశారు. పెట్రో మాక్స్ మూవీ బ్రేక్ లేకుండా 42 రోజులలో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొనడం విశేషం. దేవి (అభినేత్రి ), దేవి 2(అభినేత్రి 2 ),ఖామోషి (హిందీ ) వంటి కామెడీ హారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తమన్నా మరొక సారి పెట్రో మాక్స్ మూవీ ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనున్నారు.
[youtube_video videoid=YBaAWaSRfl4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: