తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్.. డైరెక్టర్స్ కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం అలా వారిని ఫాలో అవుతూనే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలానే మహేష్ కు కూడా అజయ్ అనే పేరు వెంటాడుతూనే వుంది. గతంలో అజయ్ అనే పేరును మహేష్ రెండు సినిమాల్లో వాడాడు. ఇప్పుడు మూడు సారో వాడుతున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘ఒక్కడు’ మహేశ్ పేరు అజయ్. ‘దూకుడు’ సినిమాలో కూడా మహేష్ పేరు అజయ్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు మహేష్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ మహేష్ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. దూకుడు కూడా అంతే. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘అజయ్‌కృష్ణ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా.. ఈ సినిమా కూడా మహేష్ కు మంచి సక్సెస్ అందిస్తుందా..? అజయ్ పేరు కలిసొస్తుందా..? తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే..!
[youtube_video videoid=YaCGtGfoI1Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: