మెగాస్టార్ చిరంజీవికి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో ఎ.కోదండరామి రెడ్డి ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కాయి. వాటిలో ‘పసివాడి ప్రాణం’ ఒకటి. విజయశాంతి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో… బేబీ సుజిత, రఘువరన్, బాబు ఆంటోనీ, గుమ్మడి వెంకటేశ్వరరావు, జగ్గయ్య, కన్నడ ప్రభాకర్, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించగా… సుమలత అతిథి పాత్రలో దర్శనమిచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి గీత రచన చేయగా… చక్రవర్తి స్వరరచన చేశారు. “కాశ్మీరు లోయలో”, “చక్కని చుక్కల”, “అందం శరణం గచ్చామి”, “ఇదేదో గోలగా ఉంది”, “సత్యం శివం సుందరం”… ఇలా చిత్రంలోని అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. మలయాళ చిత్రం ‘పూవిను పుథియ పూందెన్నాల్’(మమ్ముట్టి, నదియా, బేబి సుజిత)కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. 1987 జూలై 23న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన ‘పసివాడి ప్రాణం’… నేటితో 32 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[youtube_video videoid=dBXqQvM4vto]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: