రాజమౌళి ‘మర్యాదరామన్న’కు 9 ఏళ్ళు

9 Years For Sunil Maryada Ramanna,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Maryada Ramanna Movie Updates,Maryada Ramanna Telugu Movie Latest News,Actor Sunil Maryada Ramanna Movie Completed 9 Years,#9YearsForMaryadaRamanna
9 Years For Sunil Maryada Ramanna

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలచిన ద‌ర్శ‌కుడు య‌స్‌.య‌స్‌.రాజ‌మౌళి. అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ డైరెక్ట‌ర్‌ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ‘మర్యాదరామన్న’ ఒకటి. సునీల్, సలోని జంటగా నటించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో… నాగినీడు, సుప్రీత్, ప్రభాకర్, బ్రహ్మాజీ, రావురమేష్ తదితరులు ఇతర ముఖ్య భూమిక‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే సినిమాలో కీల‌క పాత్ర అయిన‌ సైకిల్‌కి మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ అందించాడు. హాలీవుడ్ మూవీ ‘అవర్ హాస్పిటాలిటీ’ (1923) స్పూర్తితో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీత‌మందించారు. నాలుగు నంది అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని… త‌మిళంలో ‘వల్లవన్‌క్కు పుల్లం ఆయుధం’ పేరుతోనూ, మ‌ల‌యాళంలో ‘ఇవన్ మర్యాదరామన్’ పేరుతోనూ, క‌న్న‌డంలో‘మర్యాదే రామన్న’పేరుతోనూ, బెంగాలీలో ‘ఫాండే పోరియా బొగ కాండేరే’ పేరుతోనూ, హిందీలో ‘సన్ ఆఫ్ సర్ధార్’ పేరుతోనూ రీమేక్ చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 2010 జూలై 23న విడుదలైంది. సునీల్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌చిన‌ ‘మర్యాదరామన్న’… నేటితో 9 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=m5ggBEBcEXI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =