వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. అతి త్వరలో ఈ యూత్ ఐకాన్ `డియర్ కామ్రేడ్`గా పలకరించబోతున్నాడు. స్టూడెంట్ పాలిటిక్స్, ప్రేమ, బ్రేకప్ వంటి అంశాలతో… ఓ యువకుడి లైఫ్ జర్నీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ రూపొందించాడు. విజయ్‌కి జోడీగా రష్మిక నటించింది. `గీత గోవిందం` తరువాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ ఈ మూవీకి `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. 169 నిమిషాల 57 సెకండ్ల రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన `డియర్ కామ్రేడ్`… ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి… వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్… ఈ సినిమాతోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.
[youtube_video videoid=KqwatWYFI7o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: