ఒక పక్క కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే మరోపక్క వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడియన్స్ ను మొన్నటి వరకూ ఎంటర్ టైన్ చేశాయి. మొన్నటితో వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిపోయింది. కానీ ఆమ్యాచ్ ఇచ్చిన కిక్ ను మాత్రం ఇంతవరకూ మరిచిపోలేకపోతున్నారు చాలా మంది. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ కప్ చరిత్రలో.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం ప్రత్యేకం. గతంలో ఎప్పుడు ప్రపంచ కప్ మ్యాచ్ లు జరిగినా… ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు తడబటం.. లక్ష్య చేధనలో మరో జట్టు సునాయాసంగా గెలవడమో చూశాం కానీ.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం రెండు జట్లూ పోటా పోటీగా పరుగులు సాధించి.. టై తో ముగిసింది. ఫైనల్ గా ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే గెలవడానికి ఇంగ్లడ్ గెలిచినా.. న్యూజిలాండ్ విషయంలో మాత్రం అందరికీ ఎక్కడో చిన్న బాధ మాత్రం ఉంది. అందుకే అంత తొందరగా మరిచిపోలేకపోతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు ఎందరో ఈ వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ప్రదర్శనను పొగుడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా వరల్డ్ కప్ ఫైనల్‌పై స్పందించారు. ‘‘ఇప్పటికీ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ మైకంలోనే ఉన్నా.. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్ మాత్రం తప్పకుండా హృదయాలను గెలుచుకుంది. ఇరు జట్లకు అభినందనలు’’ అని మహేష్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. మొత్తానికి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ అందరినీ కలిచివేసిందన్నమాట.
[youtube_video videoid=a40axtY__zw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: