మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హీరో నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ RX 100 మూవీ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జెర్సీ వంటి సూపర్ హిట్ మూవీ కి సంగీతం సమకూర్చిన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగస్ట్ లో రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ గ్యాంగ్ లీడర్ మూవీ ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గ్యాంగ్ లీడర్ మూవీ ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ప్రీ లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకొంది. గ్యాంగ్ లీడర్ మూవీఫస్ట్ లుక్ జులై 15 వతేదీ, ఫస్ట్ సాంగ్ జులై 18 వ తేదీ, టీజర్ జులై 24వ తేదీ రిలీజ్ కానున్నాయి. ట్రైలర్, మిగతా సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. సూపర్ హిట్ జెర్సీ మూవీ తరువాత నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
We MET We are READY We are the GANG & I AM#GANGLEADER 🖐🏼👊🏼 @Vikram_K_Kumar @MythriOfficial @anirudhofficial @priyankaamohan pic.twitter.com/l7ZO7C2Le7
— Nani (@NameisNani) July 13, 2019
[subscribe]
[youtube_video videoid=dczWU51eqYA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: